భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి రాజ్యసభ సభ్యునిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
చారిత్రక తీర్పులు..
సీజేఐగా 2018 అక్టోబరు 3 నుంచి 2019 నవంబరు 17వరకు విధులు నిర్వర్తించారు గొగొయి. ఈయన తన 13 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పుతో చారిత్రక పరిష్కారం చూపారు జస్టిస్ గొగొయి. రాఫెల్ యుద్ధవిమానం, శబరిమల తీర్పుల్లో కూడా సంచలనాత్మక తీర్పులు చెప్పారు.
ఇదీ చదవండి:ఉరి వాయిదా కోసం నిర్భయ దోషి విడాకుల 'కుట్ర'!