తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ పర్యటనలో 16 దేశాల ప్రతినిధుల బృందం - Centre to escort foreign envoys for J&K visit

16 దేశాల ప్రతినిధుల బృందం జమ్ముకశ్మీర్​కు చేరుకుంది. ఆర్టికల్​ 370 రద్దు తరువాత ప్రస్తుతం కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితుల గురించి విదేశీయులుకు వివరిస్తున్నారు భారత అధికారులు. ఈ బృందంలోని లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల రాయబారులు నేడు, రేపు భారత్​లో పర్యటించనున్నారు.

Envoys from 16 nations in Kashmir to assess ground situation
కశ్మీర్​కు చేరుకున్న 16 దేశాల ప్రతినిధులు!

By

Published : Jan 9, 2020, 1:27 PM IST

అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్‌తో పాటు మరో 15 దేశాల రాయబారులు కశ్మీర్​కు చేరుకున్నారు. 370, అధికరణ 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు 16 దేశాల ప్రతినిధులు వచ్చారు. వీరిలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు.

కశ్మీర్​కు చేరుకున్న 16 దేశాల ప్రతినిధులు!

పర్యటన ఇందుకే..

ప్రత్యేక విమానంలో శ్రీనగర్​ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు​ కేంద్రపాలిత ప్రాంత అధికారులు ఘన స్వాగతం పలికారు. కశ్మీర్​లో పర్యటించి.. స్థానికుల ప్రస్తుత పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న తరువాత రేపు భారత శీతాకాల రాజధాని జమ్ములో పర్యటిస్తారు రాయబారులు.

భద్రతకు సంబంధించిన విషయాలను వారికి వివరిస్తున్నాయి భారత భద్రతా దళాలు. ఈ పర్యటనలో పొరుగు దేశం పాకిస్థాన్​.. కశ్మీర్​లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని విదేశీ రాయబారులకు తెలియజేస్తాయి.

అగ్రరాజ్యంతో పాటు.. బంగ్లాదేశ్​, వియత్నాం, నార్వే, మాల్దీవులు, దక్షిణ కొరియా, మోరాకో, నైజీరియా తదితర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.

వీరిని కలుస్తారు...

జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్​ గిరీశ్​ చంద్ర ముర్ముతో విదేశీ ప్రతినిధుల బృందం రేపు భేటీ కానున్నట్లు వెల్లడించారు అధికారులు. తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు జమ్ముకశ్మీర్​ను సందర్శించాలని చాలా దేశాలు కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్య దేశాలు మాత్రం కశ్మీర్​ను మరికొద్ది రోజుల తర్వాత సందర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబుబా ముఫ్తిలతో సమావేశం కావాలని ప్రతినిధుల బృందం కోరుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​ను విదేశీ ప్రతినిధులు బృందం సందర్శించడం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు ఇక్కడ పర్యటించారు.

ఇదీ చదవండి:ప్రపంచంలోనే ఎత్తయిన రైలు వంతెన 2021కి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details