దేశంలో సరిపడా నిత్యావసరాలు, ఔషధాలు ఉన్నాయని స్పష్టంచేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. లౌక్డౌన్ను మరో 19 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు షా.
"దేశంలో సరిపడా ఆహార, ఔషధ, ఇతర నిత్యావసరాల నిల్వలు ఉన్నాయని దేశ హోం మంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. వాటిపై ఎవరూ ఆందోళన చెందొద్దు. సంపన్న వర్గాలు తమ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయాలని కోరుతున్నాను." - అమిత్ షా,కేంద్ర హోం మంత్రి
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై షా సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంతో కలిసి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని కోరారు. పౌరులెవ్వరూ నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర రక్షణ అధికారుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు అమిత్ షా. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి సహకారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి:మోదీ 'లాక్డౌన్ 2.0' స్పీచ్ హైలైట్స్