తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నన్ను మందలించగలిగే వారు ఆమె ఒక్కరే'

లోక్​సభ స్పీకర్​, ఇండోర్​ ఎంపీ సుమిత్రా మహాజన్​పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. విధుల పట్ల ఆమె అంకిత భావంతో ఉంటారన్నారు. తనను మందలించగల ఏకైక వ్యక్తి ఆమేనన్నారు. ఇండోర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

By

Published : May 13, 2019, 9:40 AM IST

Updated : May 13, 2019, 9:47 AM IST

ఇండోర్​ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

లోక్​సభ స్పీకర్​ సుమిత్రా మహాజన్​పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆమె పని పట్ల నిత్యం అంకిత భావంతో ఉంటారని, తనను మందలించగల ఏకైక భాజపా నేత ఆమేనని చెప్పారు. మధ్యప్రదేశ్​ ఇండోర్​లో​ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

"లోక్​సభ స్పీకర్​గా తాయ్​(ఇండోర్​లో సుమిత్ర ఈ పేరుతో ప్రసిద్ధి) విధులను ఎంతో నైపుణ్యంతో, ఓపికతో నిర్వర్తిస్తున్నారు. అందువల్లే ఆమె ప్రజల మనసులో చెరగని గొప్ప ముద్ర వేశారు. ప్రధానమంత్రిగానే నేను మీ అందరికీ తెలుసు. కానీ నన్ను మందలించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తాయ్​(సుమిత్రా మహాజన్​) మాత్రమే. ఇది పార్టీలోని అతికొద్ది మందికే తెలుసు" -- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇండోర్​ అభివృద్ధికి నాదీ భరోసా

ఇండోర్​ను సుమిత్రా మహాజన్​ ఎంతో అభివృద్ధి చేశారన్నారు ప్రధాని మోదీ. ఆమె చేయాలనుకొని మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసే భాధ్యతను తానే తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.

" నేను, సుమిత్రా మహాజన్​ భాజపాలో కలిసి పని చేశాం. ఆమె పని పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో నాకు తెలుసు. అంతే నిబద్ధతతో ఇండోర్​ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా"-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పోటీ నుంచి నిష్క్రమణ

పార్టీ నిర్ణయం మేరకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్​ గత నెల ప్రకటించారు. అయినా పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇండోర్​ లోక్​సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా శంకర్​ లల్వాణీని ఎంపిక చేసింది భాజపా.

ఎనిమిదిసార్లు వరుసగా ఎంపీగా...

వరుసగా ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు సుమిత్రా మహాజన్​. ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమె. 1989 నుంచి ఇండోర్​ ఎంపీగా ఉన్నారు సుమిత్ర. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి నారాయణ్​ పటేల్​పై 4,66,901 ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజయం సాధించారు. ఈసారి ఇండోర్​ నుంచి భాజపా తరఫున శంకర్​ లల్వాణీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్​ నుంచి పంకజ్​ సంఘ్వీ బరిలో ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికల చివరి దశలో భాగంగా మే 19న ఇండోర్​లో పోలింగ్​ జరుగుతుంది.

ఇవీ చూడండి : ఘనంగా 'త్రిస్సూర్​ పూరం' ఉత్సవాలు

Last Updated : May 13, 2019, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details