తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు అందేది రేపే - special guest

భారత వాయుసేనలో 8 అత్యాధునిక హెలికాప్టర్లు చేరనున్నాయి. మంగళవారం పంజాబ్​ పఠాన్​కోట్​లో 'అపాచీ ఏహెచ్​-64ఈ' ఛాపర్లను వాయుసేనకు బోయింగ్​ అందిస్తుందని అధికారులు తెలిపారు.

వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు అందేది రేపే

By

Published : Sep 2, 2019, 3:22 PM IST

Updated : Sep 29, 2019, 4:20 AM IST

ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్లు 'అపాచీ ఏహెచ్-64ఈ' భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించింది అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ. మరో 8 హెలికాప్టర్లను మంగళవారం పంజాబ్​ పఠాన్​కోట్​లోని భారత వైమానిక దళానికి అందించనున్నారు. ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

బోయింగ్​ సంస్థ ఇప్పటివరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు అందించింది.

నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి:మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

Last Updated : Sep 29, 2019, 4:20 AM IST

ABOUT THE AUTHOR

...view details