ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ను జైలుకు పంపే విషయంలో పాకిస్థాన్ ఏపాటి చిత్తశుద్ధి కనబరుస్తుందో చూడాలని.. అభిప్రాయం వ్యక్తం చేసింది భారత్. ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) సమావేశానికి ముందు కోర్టు తీర్పు వెలువడిన విషయాన్ని అన్ని దేశాలు గుర్తించాలని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకు చేపట్టిన కంటితుడుపు చర్యలుగా అభివర్ణించాయి.
"ఎఫ్ఏటీఎఫ్ సమావేశం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇది. దీని వెనక ఉన్న చిత్తశుద్ధిని చూడాలి. వారి భూభాగంలోని ఇతర ఉగ్ర సంస్థలు, తీవ్రవాదులపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి." అని పేర్కొన్నాయి అధికార వర్గాలు.
11 ఏళ్ల జైలు శిక్ష..