ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా కుమారుడు అబీర్, అతని అనుబంధ సంస్థ.. ఫోరెక్స్ నిబంధనలు ఉల్లఘించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిర్వహణా చట్టం(ఫెమా) కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ప్రారంభంలో నౌరిశ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనే ప్రైవేటు సంస్థకు రూ.7.25 కోట్లు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు అబీర్. మారిషస్‌కు చెందిన సామా క్యాపిటల్ అనే కంపెనీ నుంచి జరిగిన లావాదేవీల్లో ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో మరికొంత మందికి సమన్లు జారీ చేసినట్లు తెలిపిన అధికారులు.. అబీర్ లవాసా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు.