తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'15 రోజుల్లో 8 కోట్ల మంది వలసదారులకు ఉచిత రేషన్'​

దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలసదారులకు 15 రోజుల్లో ఉచితంగా రేషన్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం. గోదాముల్లోని ఆహార ధాన్యాన్ని తక్షణమే బయటకు తీసి ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార మంత్రి రామ్​ విలాస్ పాసవాన్​ సూచించారు.

By

Published : May 16, 2020, 7:36 PM IST

Distribute free ration to 8 cr migrants within 15 days
'15 రోజుల్లో 8 కోట్ల మంది వలసదారులకు ఉచిత రేషన్'​

లాక్​డౌన్ కారణంగా అనేక మంది వలసదారులు సుదూర ప్రాంతాలకు ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో... వారందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్రాలను కోరారు కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాసవాన్​. 15 రోజుల్లో 8 కోట్ల మంది వలసదారులకు ఆహర ధాన్యాలను అందించాలన్నారు. గోదాములను తక్షణమే తెరచి ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర రేషన్​ కార్డుల్లో ఏదీ లేకపోయినా అంగీకరించాలని స్పష్టం చేశారు.

కేంద్రం నిర్ణయంతో అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​లో 1.42కోట్ల మంది వలసదారులు లబ్ధి పొందనున్నారు. బిహార్​లో 86.45 లక్షల మంది, మహారాష్ట్రలో 70, బంగాల్​లో 60.1, మధ్యప్రదేశ్​లో 54.6, రాజస్థాన్​లో 44.66, కర్ణాటకలో 40.19, గుజరాత్​లో 38.25, తమిళనాడులో 35.73, ఝార్ఖండ్​లో 26.37, ఆంధ్రప్రదేశ్​లో 26.82, అసోంలో 25.15 లక్షల మంది వలసదారులు రేషన్ పొందనున్నారు. దేశ రాజధాని దిల్లీలో 7.27లక్షల మంది వలసదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం, కేజీ పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రస్తుతం లబ్ధి పొందుతున్న 81కోట్ల మందిలో 10శాతం మందిని వలసదారులుగా అంచనా వేసినట్లు పాసవాన్​ తెలిపారు. ఒకవేళ సంఖ్య ఎక్కువైతే రాష్ట్ర ప్రభుత్వాలు సరైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ పంపిణీ చేయాలన్నారు.

వలసదారులకు రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందిచనున్నట్లు, ప్రత్యేక ప్యాకేజిని కేటాయించినట్లు మే 14న ప్రకటించింది కేంద్రం. ఇందుకోసం రూ.3,500కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది.

వలసదారుల కోసం దాదాపు 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించినట్లు పాసవాన్​ తెలిపారు. వేలాది మంది కాలినడకనే స్వస్థలాలకు చేరుకుంటున్నారని, మార్గం మధ్యలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details