తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2019, 3:22 PM IST

Updated : Apr 1, 2019, 3:48 PM IST

ETV Bharat / bharat

'విదేశీయుల నిర్బంధం కేసు'పై సుప్రీం అసంతృప్తి

ఈశాన్య రాష్ట్రం అసోంలో విదేశీయుల నిర్బంధం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసోం ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్​పై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఏప్రిల్ 8న ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది.

ఏప్రిల్ 8న రండి: అసోం సీఎస్​కు సుప్రీం ఆదేశం

విదేశీయుల నిర్బంధం కేసుపై సుప్రీం విచారణ
అసోంలో విదేశీయుల నిర్బంధం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏప్రిల్​ 8లోగా అసోం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మాసనం ముందు హాజరు కావాలని ఆదేశించింది.

అసోంలో విదేశీయుల నిర్బంధంపై స్వచ్ఛంద కార్యకర్త హర్ష్​ మండార్​ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్ సంజీవ్​కన్నాల త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

అసోం ప్రభుత్వం సమర్పించిన ప్రమాణ పత్రం (అఫిడవిట్​)పై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక ప్రజల్లో కలిసిపోయిన విదేశీయులను, ఎంతమందిని ట్రైబ్యునల్​ గుర్తించిందో తెలపాలని ఆదేశించింది. విచారణకు అసోం అధికారులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

"అసోంలోని స్థానిక ప్రజల్లో కలిసిపోయినట్లు ప్రకటించిన.. విదేశీయుల సంఖ్య ఎంత? ఈ విషయం తెలుసుకోవడానికే అసోం ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించాం." - సుప్రీంకోర్టు

అసోంలోని నిర్బంధ కేంద్రాల పరిస్థితి, విదేశీయులను దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంతకు మునుపు అసోంలో ఎన్ని నిర్బంధ కేంద్రాలు ఉన్నదీ, వాటి పరిస్థితులు ఎలా ఉన్నదీ తెలపాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి:అండమాన్​-నికోబార్: 2 గంటల్లో 9 భూకంపాలు

Last Updated : Apr 1, 2019, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details