కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందిని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. విమానాలు, ఓడల ద్వారా వీరిని స్వదేశం చేర్చనుంది. వీటికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్‌ను కేంద్ర హోమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
నిబంధనలివే..
- ఎవరి ప్రయాణ ఖర్చులు వారే భరించాలి.
- వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
- బోర్డింగ్‌కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతి ఉంటుంది.
- ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- మాస్క్‌లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- స్వదేశం చేరుకున్నాక సొంత ప్రాంతాలకు చేరుకునే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి.
- ప్రయాణికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
- స్వదేశం వచ్చాక తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి.
- ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపాలి. కొద్దిరోజులు స్వీయ నిర్భందంలో ఉండాలి.