తెలంగాణ

telangana

విద్వేష సందేశాలపై ఫిర్యాదు చేస్తే రూ.10 వేల బహుమానం

By

Published : Mar 3, 2020, 7:08 AM IST

హస్తినలో అల్లర్ల నేపథ్యంలో దిల్లీ అసెంబ్లీ కమిటీ ఓ మొబైల్​ నంబర్​, ఈ మెయిల్​ ఐడీని నేడు ప్రారంభించనుంది. విద్యేషపూరిత సందేశాలు, నకిలీ వార్తలపై ప్రజలు వీటిలో ఫిర్యాదు చేయవచ్చు.

Delhi Assembly panel to launch number
విద్వేష సందేశాలపై ఫిర్యాదు చేస్తే రూ.10 వేల బహుమానం

రాజధాని దిల్లీలో అల్లర్లను నియంత్రించేందుకు ఆప్ సర్కారు చర్యలు చేపట్టింది. దిల్లీ అసెంబ్లీ 'శాంతి, సామరస్య కమిటీ' నేడు ఓ మొబైల్​ నంబర్​, ఈ మెయిల్​ ఐడీని ప్రారంభించనుంది. ఎవరైనా నకిలీ వార్తలు, విద్వేషపూరిత సందేశాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబర్​కు చేయవచ్చని కమిటీ తెలిపింది..

ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత వాటిని పోలీసులకు పంపుతామని కమిటీ ఛైర్మన్ ఆప్​ ఎమ్మెల్యే సౌరభ్​ భరద్వాజ్​ వెల్లడించారు.

" మీరు ఏదైనా ఛాట్​ గ్రూప్​లో ఉన్నప్పుడు... ఎవరైనా రెచ్చగొట్టే సందేశాలను పంపితే, వెంటనే మీరు మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐర్​ నమోదైతే చేసినవారికి రూ.10,000 బహుమతి ఇస్తాం." - భరద్వాజ్​, కమిటీ ఛైర్మన్​

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఎందరో ప్రాణాలను కాపాడిన వారికీ బహుమానం ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలిపారు.

వాట్సాప్​ లేదా సామాజిక మాధ్యమాల్లో విద్వేష సందేశాలు పెట్టేవారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కమిటీ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details