తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం - జమ్ముకశ్మీర్​లో మరోసారి పర్యటించనున్న విదేశీ ప్రతినిధులు

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు విదేశీ ప్రతినిధుల బృందాన్ని పర్యటనకు ఆహ్వానించారు అధికారులు. గల్ఫ్​ ప్రాంతం సహా దాదాపు 15 నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ వారాంతంలో కశ్మీర్​ను సందర్శించనున్నారు.

JK-ENVOYS
జమ్ముకశ్మీర్​

By

Published : Jan 8, 2020, 5:11 AM IST

Updated : Jan 8, 2020, 10:05 AM IST

కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

ఆర్టికల్​ 370, అధికరణ 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులను వివరించేందుకు 15-20 దేశాల ప్రతినిధులను జమ్మూ పర్యటనకు తీసుకెళ్లనున్నారు అధికారులు. ఇందులో గల్ఫ్​ దేశాల ప్రతినిధులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

పీ5 దేశాలైన అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్, రష్యాల ప్రతినిధులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 15 నుంచి 20 మంది విదేశీ ప్రతినిధులను ఈ వారాంతంలో కశ్మీర్​లోయ సందర్శనకు తీసుకువెళ్లనున్నారు అధికారులు. ఈ పర్యటనలో పొరుగు దేశం పాకిస్థాన్​.. కశ్మీర్​లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని భద్రతా దళాలు వివరించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. అదే రోజు వారు జమ్మూలో లెఫ్టినెంట్ గవర్నర్​ గిరీశ్​ చంద్ర ముర్ముతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.

తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు.. జమ్ము కశ్మీర్​ను సందర్శించాలని చాలా దేశాలు కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఐరోపా, ఆఫ్రికా, మధ్య​ ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు కశ్మీర్​లోయ సందర్శనకు రానున్నారని సమాచారం. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం జమ్ముకశ్మీర్​ అంశంపై పాకిస్థాన్​ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమేనని తెలుస్తోంది.

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​ను విదేశీ ప్రతినిధులు బృందం సందర్శించడం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు ఇక్కడ పర్యటించారు.

ఇదీ చూడండి:మేరఠ్​ తలారి, బక్సర్​ తాడుతో నిర్భయ దోషులకు ఉరి!

Last Updated : Jan 8, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details