తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ ఘటనపై గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి'

హైదరాబాద్​లో పశువైద్యురాలి హత్యాచార​ ఘటనపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటన విచారకరమని, తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు... మాట్లాడటం కంటే ఇంకేదైనా చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు

priyanka
గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి': ప్రియాంక గాంధీ

By

Published : Dec 1, 2019, 7:13 AM IST

Updated : Dec 1, 2019, 7:51 AM IST

హైదరాబాద్​ షాద్​నగర్​లో యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా.. మనం ఇలాంటి సంఘటనలపై గళమెత్తడం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆమె ట్వీట్​ చేశారు.

గళమెత్తితే చాలదు.. ఇంకేదో చేయాలి': ప్రియాంక గాంధీ

"మన మనస్తత్వాలు మారాలి, హింసను తిరస్కరించాలి. మహిళలపై జరిగే క్రూర, అసహ్యకరమైన ఈ హింసాత్మక పద్ధతికి అడ్డుకట్ట వేయాలి. హైదరాబాద్‌లోని యువ పశువైద్యురాలు, సంభల్‌లోని బాలికపై జరిగిన క్రూరమైన హత్యాచారం నన్ను చాలా బాధించింది. నా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదాలూ సరిపోవు. సమాజంలో ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం కంటే మనం ఇంకేదైనా ఎక్కువే చేయాలి.''

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఈ ఘటనను ఖండించారు.

ఇదీ చూడండి : శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్​

Last Updated : Dec 1, 2019, 7:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details