తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం..!

ప్రాణాలతో ఉన్న మహిళ చనిపోయినట్లు తప్పుగా మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేసిన ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సస్పెండ్​ అయ్యారు. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

By

Published : Jul 5, 2019, 5:05 AM IST

Updated : Jul 5, 2019, 9:23 AM IST

వైద్యుల నిర్లక్ష్యం: బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం

వైద్యుల నిర్లక్ష్యం: బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం

స్వైన్​ ఫ్లూ సోకిందనే అనుమానంతో ఓ మహిళ మధ్యప్రదేశ్ జబల్​పుర్ నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్వైన్​ ఫ్లూ వార్డు నుంచి ఐసీయూకు తరలిస్తుండగా... ఓ జూనియర్ డాక్టర్​ సదరు మహిళ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు తెలియజేశారు.

ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం జూనియర్​ డాక్టర్​ సహా మరో డాక్టర్​ను సస్పెండ్​ చేశారు అధికారులు.

చనిపోయిన మరో రోగి పత్రాలను జూనియర్​ డాక్టరు తప్పుగా అర్థంచేసుకున్నందు వల్లే ఇలా జరిగిందని సీనియర్ వైద్యులొకరు తెలిపారు. అతనికి హిందీ రాదని.. పత్రాలపై హిందీలో వివరాలున్నట్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు డాక్టర్లపై చర్యలు తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి: పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్​

Last Updated : Jul 5, 2019, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details