తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోబ్రా దళంలోకి మహిళా కమాండోలు - సీఆర్​పీఎఫ్​

నక్సల్స్​ వ్యతిరేక కార్యకలాపాలకు రూపొందించిన సీఆర్​పీఎఫ్​ కోబ్రా దళంలో మహిళా కమాండోలు చేరనున్నారు. సీఆర్‌పీఎఫ్ 88వ ఆల్ విమెన్ బెటాలియన్‌ రైసింగ్ డేలో భాగంగా ఆరు మహిళా బెటాలియన్ల నుంచి 34 మందిని కోబ్రాకి అనుసంధానం చేశారు. శిక్షణ తర్వాత వారు కోబ్రాలో చేరుతారని అధికారులు వెల్లడించారు.

CRPF
నక్సల్ వ్యతిరేక దళం కోబ్రాలోకి మహిళాకమెండోలు

By

Published : Feb 6, 2021, 2:44 PM IST

Updated : Feb 6, 2021, 2:53 PM IST

దేశవ్యాప్తంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సీఆర్​పీఎఫ్​కు చెందిన కోబ్రా దళంలో ఇకపై మహిళా కమాండోలు కూడా భాగం కానున్నారు. సీఆర్‌పీఎఫ్ 88వ ఆల్ విమెన్ బెటాలియన్‌ రైసింగ్ డేలో భాగంగా.. ఆరు మహిళా బెటాలియన్ల నుంచి 34 మందిని కోబ్రాకి అనుసంధానం చేశారు.

మహిళా కమాండోల విన్యాసాలు
మహిళా కమాండోల విన్యాసాలు
మహిళా కమాండోల విన్యాసాలు

వీరికి శిక్షణ అనంతరం.. కోబ్రా దళంలో అంతర్భాగం అవుతారని సీఆర్‌పీఎఫ్ అధికారులు వెల్లడించారు. అటు పూర్తి స్థాయి మహిళా బ్యాండు కూడా ఏర్పాటు చేసినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. 88వ మహిళా బెటాలియన్ 34 ఏళ్లుగా సేవలందిస్తోంది.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం- రైతుల నిర్బంధం

Last Updated : Feb 6, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details