తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు!

లాక్​డౌన్​ కొనసాగుతున్నా దేశంలో కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,380 కేసులు నమోదుకాగా, 193 మంది ప్రాణాలు కోల్పోయారు.

By

Published : May 31, 2020, 8:40 PM IST

Corona cases are on the rise in record numbers in India
ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా మహమ్మారి మరింత భయంకరంగా విజృభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,380 కేసులు నమోదయ్యాయి. 193 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రాల్లోనూ... రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

తమిళనాడు

తమిళనాడులో ఇవాళ రికార్డు స్థాయిలో 1,149 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1054 కేసులు రాష్ట్రంలోనే నమోదుకాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 95మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మరోవైపు ఇవాళ 13మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 173కి చేరుకుంది.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో గత 24గంటల్లో 91మంది పోలీసులకు కోవిడ్ సోకినట్లు తేలింది. ఇప్పటివరకు 2,416 మంది పోలీసులు వైరస్ బారినపడగా, 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​

రాష్ట్రంలో కొత్తగా 371 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య పరంగా చూస్తే ఇదే అత్యధికం. మరోవైపు 8 మంది కరోనాకు బలయ్యారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 309కి చేరింది.

కేరళ

కేరళలో ఇవాళ 61 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన 20 మంది కూడా ఉన్నారు. కేరళలో ఇప్పటివరకు 1,269 మందికి వైరస్ సోకగా, 9 మంది మరణించారు. 670 మంది చికిత్స పొందుతున్నారు.

మణిపూర్​

కొత్తగా 9 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 71కి పెరిగింది. ఎనిమిది మంది కోలుకున్నారు.

పంజాబ్​

కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 2,263కి చేరింది.

జమ్ము కశ్మీర్​

కొత్తగా 105 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 2,446కి పెరిగింది.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మరణాలు

ఇదీ చూడండి:'భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరగట్లేదు'

ABOUT THE AUTHOR

...view details