తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేర చరిత్ర' తీర్పుపై భాజపాకు ఎక్కుపెట్టిన కాంగ్రెస్​ - congress spoke person statement

అభ్యర్థుల నేరచరిత్రను పార్టీలు అధికారిక వెబ్​సైట్లలో పొందుపరచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భాజపాపై విమర్శనాస్త్రాలు సందించింది కాంగ్రెస్​. పలు కేసుల్లో నిందితులకు టిక్కెట్లు ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం ఆదేశాలను ఎప్పుడో ఉల్లంఘించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

congress targets modi
'నేర చరిత్ర' తీర్పుపై భాజపాకు ఎక్కుపెట్టిన కాంగ్రెస్​

By

Published : Feb 13, 2020, 7:31 PM IST

Updated : Mar 1, 2020, 6:02 AM IST

నేర చరిత్ర గల అభ్యర్థులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భాజపాపై కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. పలు కేసుల్లో నిందితులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు ఆదేశాలను ఎప్పుడో ఉల్లంఘించారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా విమర్శించారు. కర్ణాటకలో గనుల అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడికి భాజపా మంత్రి పదవి కట్టబెట్టిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వగలదా అని సుర్జేవాలా ప్రశ్నించారు. ఇదే సమయంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. రాజకీయాల్లోకి నేరస్థులు రాకుండా తీర్పు దోహదపడుతుందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును భాజపా కూడా సమర్థించింది. ప్రజలు ఓటు వేసే ముందు అభ్యర్థుల నేరచరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత నలిన్‌ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కేజ్రీవాల్​ ప్రమాణస్వీకారానికి 'బుల్లి కేజ్రీవాల్​'

Last Updated : Mar 1, 2020, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details