తెలంగాణ

telangana

135 ఏళ్ల కాంగ్రెస్: దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు

By

Published : Dec 28, 2019, 2:22 PM IST

Updated : Dec 28, 2019, 3:43 PM IST

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సేవ్​ నేషన్​-సేవ్​ కాన్​స్టిట్యూషన్​ ర్యాలీకి దేశవ్యాప్తంగా పిలుపిచ్చింది కాంగ్రెస్. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో తిరంగ ర్యాలీలు చేపట్టారు పార్టీ ఇన్​ఛార్జిలు.

Cong takes out flag march in Mumbai on party's foundation day and anti caa protests all over india
135 ఏళ్ల కాంగ్రెస్: దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు

135 ఏళ్ల కాంగ్రెస్: దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 'సేవ్ నేషన్-సేవ్ కాన్​స్టిట్యూషన్' పేరిట నిరసన ర్యాలీలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతున్నాయి.

అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్​ఛార్జి​లు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో శాంతియుత నిరసనలు చేపట్టారు. దిల్లీలో కాంగ్రెస్​ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్​లో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా గాంధీ భవన్​ వద్దే సత్యాగ్రహ దీక్షకు దిగారు కాంగ్రెస్ నేతలు.

మహారాష్ట్ర

కాంగ్రెస్ పిలుపుతో మహారాష్ట్రలో ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదానం నుంచి గిర్​గావ్​ చౌపాటిలోని లోకమాన్య తిలక్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్​ఛార్జి మల్లికార్జున ఖర్గే సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీకి ముందు..

1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన ప్రదేశమైన తేజ్​పాల్​ హాల్​లో ర్యాలీకు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఖర్గే. ఆగస్ట్ క్రాంతి మైదానంలో అమరవీరులకు నివాళులు అర్పించారు.

కేరళలో

పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తూ కేరళలో మహా ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ ర్యాలీకి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సహా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: 'భారతదేశమే కాంగ్రెస్​కు తొలి ప్రాధాన్యం'

Last Updated : Dec 28, 2019, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details