తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 5:28 PM IST

ETV Bharat / bharat

'బడాబాబులకు రూ.68 వేల కోట్ల రుణమాఫీ'

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో మండిపడింది. బడా రుణ ఎగవేతదారుల అప్పులను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించింది. వీటి విలువ రూ.68వేల 607 కోట్లని పేర్కొంది. ఈ మేరకు స.హ చట్ట ద్వారా దాఖలైన ఓ ప్రశ్నకు ఆర్​బీఐ ఇచ్చిన జవాబును ఆధారంగా చూపించింది కాంగ్రెస్​.

Cong cites RTI reply to allege govt waived Rs 68,607 cr of bank loan defaulters
'రుణ ఎగవేతదారుల 68వేల కోట్ల అప్పులు మాఫీ'

దేశంలోని రుణ ఎగవేతదారుల జాబితాలోని తొలి 50 మందికి సంబంధించిన రూ. 68వేల 607 కోట్లను కేంద్రం మాఫీ చేసిందని కాంగ్రెస్​ ఆరోపించింది.ఈ మేరకు స.హ చట్ట ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) ఇచ్చిన జవాబును ఆధారంగా చూపించింది.

2014 నుంచి 109సెప్టెంబర్​ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్లు విలువ గల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది కాంగ్రెస్​.

తొలి 50మంది బ్యాంకుల రుణ ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాలని పార్లమెంట్​ వేదికగా తాను ప్రశ్నించినట్టు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ గుర్తుచేశారు.

"పార్లమెంట్​లో నేను ఒక ప్రశ్న సూటిగా అడిగాను. తొలి 50 మంది రుణ ఎగవేతదారుల పేర్లు చెప్పమన్నాను. అప్పుడు సమాధానం చెప్పడానికి ఆర్థిక మంత్రి నిరాకరించారు. ఇప్పుడు బ్యాంకు మోసాలంటూ.. నీరవ్​ మోదీ, మెహుల్​ ఛోక్సీతో పాటు అనేక మంది భాజపా మిత్రుల పేర్లను జోడించి ఓ జాబితాను రూపొందించింది ఆర్​బీఐ. ఆ రోజు పార్లమెంట్​లో ఇందుకే నిజాన్ని దాచారు."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

'మోదీ స్పందించాల్సిందే...'

ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా. అసలు వాళ్ల రుణాలను ఎందుకు మాఫీ చేశారో మోదీ స్పష్టం చేయాలని తెలిపారు.

కరోనాపై పోరులో రాష్ట్రాలకు సహాయం చేసేందుకు నిధులు లేవు కానీ.. మెసగాళ్ల రుణాలను మాఫీ చేసేంత దయాగుణం మాత్రం కేంద్రానికి ఉందని మండిపడ్డారు సుర్జేవాలా.

ఇదీ చూడండి:-'ఒకే దేశం- ఒకే రేషన్ ​కార్డు అమలు సాధ్యమా?'

ABOUT THE AUTHOR

...view details