శీతల గాలులతో ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతూనే ఉన్నాయి. సోమవారం దిల్లీలో గత 119 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శీతల వాతావరణానికి వణికిపోతున్న ఉత్తరాది వాసులు లోధి రోడ్‌లో3.7, ఆయనగర్‌లో 4.2, పాలంలో 4.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. దిల్లీలో వాయునాణ్యత ప్రమాణాలు మరోసారి పడిపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
పంజాబ్‌లోని లూధియానాలోనూ అతిశీతల వాతావరణంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. లూధియానాలో ఉదయం 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. చలిమంటలతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తున్నారు.
ఇక జమ్ములో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రావడంలేదని స్థానికులు తెలిపారు. కశ్మీర్‌లో ఇప్పటికే దాల్ సరస్సు సహా జలవనరులు గడ్డగట్టాయి.
ఇదీ చదవండి:'మా నాయకుడిని విమర్శిస్తే.. ఇంకు పడుద్ది!'