కోర్టుల్లో అర్థవంతమైన చర్చలకు బదులు అసంబద్ధ వాదనలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి అభిప్రాయపడ్డారు. ప్రేరేపిత వాదనలు పెరిగి పోయాయన్నారు. హేతుబద్ధత లోపిస్తున్న కారణంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆయన అన్నారు. ఇతర కోర్టులతో పాటు.. సుప్రీంకోర్టుకూ ఇలాంటివి వ్యాపించాయని జస్టిస్ గొగొయి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత భాగస్వాములంతా దీన్ని త్వరితగతిన నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తద్వారా న్యాయవ్యవస్థ గౌరవం ఇనుమడింపజేయాలన్నారు.
'కోర్టుల్లో అసంబద్ధ వాదనలు పెరిగిపోతున్నాయి' - ప్రధన న్యాయమూర్తి
పెరిగిపోతున్న అసంబద్ధమైన వాదనలకు న్యాయవ్యవస్థ సాక్షీభూతంగా నిలుస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి వ్యాఖ్యానించారు. కింది స్థాయి కోర్టులతో పాటు సుప్రీం కోర్టుకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడంపై గొగొయి ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ రంజన్ గొగొయి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయి. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'
Last Updated : Sep 27, 2019, 3:16 AM IST