తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్మయానంద కేసు: 'అదృశ్య యువతిని తీసుకురండి'

భాజపానేత, కేంద్ర మాజీమంత్రి చిన్మయానంద ద్వారా వేధింపులను ఎదుర్కొని, ఆరోపించి.. కనిపించకుండా పోయిన న్యాయవాద విద్యార్థినిని నేడే తమ ఎదుట ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజస్థాన్​లో యువతిని కనుగొన్నామని... కోర్టు ఎదుట హాజరు పరిచేందుకు రెండున్నర గంటల సమయం కావాలని యూపీ ప్రభుత్వ లాయర్ ధర్మాసనానికి సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో యువతిని కోర్టుకు తరలిస్తున్నారు. మరికాసేపట్లో ధర్మాసనం ఎదుట హాజరు పరచనున్నారు.

చిన్మయానంద కేసు: 'అదృశ్య యువతిని తీసుకురండి'

By

Published : Aug 30, 2019, 4:32 PM IST

Updated : Sep 28, 2019, 9:08 PM IST

కేంద్ర మాజీమంత్రి చిన్మయానంద ద్వారా వేధింపులను ఎదుర్కొందన్న ఆరోపణల అనంతరం కనిపించకుండా పోయిన న్యాయ విద్యార్థినిని తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంబంధిత యువతిని రాజస్థాన్​లో కనుగొన్నామని... తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు షాజాహాన్​పుర్​కు తరలిస్తున్నామని హాజరుకు ఆదేశిస్తే రెండున్నర గంటల లోపల ధర్మాసనం ఎదుట ప్రవేశపెడతామని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు.

జస్టిస్. ఆర్​. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం... ఆమెను రహస్యంగా విచారిస్తుందని తదుపరి ఆదేశాల కోసం మరోసారి సమావేశమౌతామని కోర్టు వెల్లడించింది.

భాజపా నేత, కేంద్ర మాజీమంత్రి చిన్మయానంద తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ యువతి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్లుగా పేర్కొంది. వీడియో ఆధారంగా చిన్మయానందపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం యువతి అదృశ్యమైంది.

ఇదీ చూడండి: స్వామి చిన్మయానంద్ పై కేసు నమోదు

Last Updated : Sep 28, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details