తెలంగాణ

telangana

'కరోనా'పై అలర్ట్​.. 7 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు​

By

Published : Jan 21, 2020, 8:50 PM IST

Updated : Feb 17, 2020, 10:02 PM IST

చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చైనా నుంచి భారత్​ వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్​ టెస్ట్​ చేయించాలని పౌర విమానయానశాఖ అధికారులను ఆదేశించింది.

virus
కరోనా వైరస్​... చైనా నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్​ టెస్ట్​

చైనాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఏడు విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాల్సిందిగా పౌరవిమానయానశాఖ అధికారులను ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ,ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో... చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించింది. చైనా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే విమాన సర్వీసుల్లో జ్వరం, దగ్గుతో బాధపడుతున్నవారి వివరాలు సేకరించేందుకు అనౌన్స్‌మెంట్‌లు చేయాలని ఎయిర్‌లైన్స్‌లకు సూచించింది. ఇదే సమయంలో..... గత 14 రోజుల్లో వుహాన్‌ నగరంలో పర్యటించారా అనే విషయాలను సేకరించాలని సూచించింది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని భారతీయ విద్యార్థులను, చైనాలో పర్యటించేవారికి కేంద్రం ఇప్పటికే సూచనలు చేసింది.

ఇదీ చూడండి : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్​... భారత్​ అప్రమత్తం

Last Updated : Feb 17, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details