తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2019, 3:38 PM IST

ETV Bharat / bharat

'ఆమె మృతికి కారణం 'గాలి'... కేసు పెట్టండి'

చెన్నైలో ఫ్లెక్సీ పడి 23 ఏళ్ల సాఫ్ట్​వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అన్నాడీఎంకే పార్టీ నేత సి. పొన్నయన్​. ఆమె మరణానికి గాలి కారణమన్నారు.

'ఆమె మృతికి కారణం 'గాలి'... కేసు పెట్టండి'

అన్నాడీఎంకే సీనియర్​ నేత, తమిళనాడు మాజీ మంత్రి పి. పొన్నయన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. గత నెల 12న తమిళనాడు రాజధాని చెన్నైలో ఫ్లెక్సీ పడి 23ఏళ్ల సాఫ్ట్​వేర్ ఉద్యోగిని మృతి చెందడానికి గాలి కారణన్నారు పొన్నయన్. అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ​ కారణంగా ప్రమాదం జరగలేదని, గాలి వల్లే అలా అయిందని అన్నారు పొన్నయన్​. అందుకే గాలిపైనే కేసు నమోదు చేయాలని సూచించారు.

"కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకలో భాగంగా జయగోపాల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన కావాలని ఫ్లెక్సీని శుభశ్రీ మీదకు విసరలేదు. జయగోపాల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం సరికాదు. గాలి వల్లే ఆ ఫ్లెక్సీ పడిపోయింది. కాబట్టి గాలిపైనే కేసు పెట్టాలి."
-పొన్నయన్​, తమిళనాడు మాజీ మంత్రి.

పొన్నయన్ వాఖ్యలను ప్రతిపక్షాలు, సామజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతల మొరటుతనానికి నిదర్శనమని డీఎంకే అధికార ప్రతినిధి విమర్శించారు.

గత నెలలో ప్రమాదం

సెప్టెంబరు 12న చెన్నైలో స్కూటీపై ప్రయాణిస్తోంది 23 ఏళ్ల సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని శుభశ్రీ. అకస్మాత్తుగా ఓ ఫ్లెక్సీ​ పైనుంచి వచ్చి ఆమెపై పడగా... స్కూటీ అదుపు తప్పింది. వెనకాల వస్తున్న ట్యాంకర్​ శుభశ్రీ పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

హోర్డింగ్​లు ఏర్పాటు చేయొద్దని తమిళనాడు హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినా అక్రమంగా ఫ్లెక్సీ​ ఏర్పాటు చేశారు అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్​ జయగోపాల్. శుభశ్రీ మరణం అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: సెజ్​లోకి అనుమతి నిరాకరించారని కత్తులతో దాడి

ABOUT THE AUTHOR

...view details