కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేల మంది రక్షణ సిబ్బందిని తరలించాలని హోంశాఖ ఈ నెల 25న ఆదేశాలిచ్చింది.
50 కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు(సీఆర్పీఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) 30, భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ దళం(ఐటీబీపీ) 10, సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)10 సైనిక కంపెనీలను రైలుమార్గం ద్వారా తరలించనున్నారని సమాచారం.