తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' మహారాష్ట్ర కచ్చితంగా కరోనా ప్రమాదంలో ఉంది'

కరోనా వైరస్​ కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​. అయితే కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం ధీమాను చూసి తనకు సంతోషం కలిగిందన్నారు.

CENTRAL HEALTH MINISTRY ON CORONA VIRUS OUTBREAK IN INDIA
'మహారాష్ట్రలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి'

By

Published : Apr 15, 2020, 6:59 PM IST

దేశంలో వైరస్​కు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంన్నాయని తెలిపారు.

బిహార్​, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల కార్యదర్శులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు హర్షవర్ధన్​. బిహార్​లో పరిస్థితులు ప్రస్తుతానికి ఆందోళనకరంగా లేవన్నారు. అయితే ముగ్గురు కార్యదర్శల విశ్వాసాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని తెలిపారు హర్షవర్ధన్​. 'మేము ఈ సంక్షోభాన్ని ఎదుర్కొగలం' అన్న మహారాష్ట్ర కార్యదర్శి మాటలతో తనకు ఎంతో ఉపశమనం కలిగినట్లు వివరించారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,076 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 11,933కు చేరాయి. ప్రస్తుతం 1,344 మంది కోలుకోగా.. 10197 యాక్టివ్​ కేసులున్నాయి. 392 మంది మరణించారు.

ఇదీ చూడండి:-'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'

ABOUT THE AUTHOR

...view details