ఇళ్లలో వినియోగించే అన్ని రకాల ఎయిర్ కండిషనర్లలో ఉష్ణోగ్రత సూచిక 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రారంభమయ్యేలా (డిఫాల్ట్‌గా ఉండేలా) చూడాలని కేంద్రం స్పష్టం చేసింది. ‘ఇంధన సమర్థత మండలి’ (బీఈఈ)తో సంప్రదించిన మీదట కేంద్ర సర్కారు తాజా ప్రమాణాలను ప్రకటించిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
ఏసీలు మొదలవ్వాల్సింది 24 డిగ్రీల వద్దే - ఏసీలు మొదలవ్వాల్సింది 24 డిగ్రీల వద్దే
ఎయిర్ కండిషనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కారు. అన్ని రకాల ఏసీలు 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రారంభమయ్యే విధంగా చూడాలని సూచించింది. ఈ నూతన విధానం ప్రకారం ఇళ్లలో ఏసీ స్విచ్ వేయగానే అది 24 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేయడం మొదలుపెడుతుంది.
![ఏసీలు మొదలవ్వాల్సింది 24 డిగ్రీల వద్దే ac](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5620521-thumbnail-3x2-ac.jpg)
ఏసీలు మొదలవ్వాల్సింది 24 డిగ్రీల వద్దే
ఈ నూతన నిబంధన ప్రకారం ఇళ్లలో ఏసీ స్విచ్ వేయగానే అది 24 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేయడం మొదలు పెడుతుంది. మన దేశంలో తయారు చేసిన, విక్రయించే ఒకటి నుంచి ఐదు నక్షత్ర (స్టార్) గుర్తులు ఉండే అన్ని రకాల ఏసీల్లోనూ ఇది తప్పనిసరి అని ప్రకటన స్పష్టం చేస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చింది.
ఇదీ చూడండి: కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!
Last Updated : Jan 7, 2020, 7:56 AM IST