తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కును ఢీకొన్న కారు...9 మంది విద్యార్థులు మృతి - కళాశాల విద్యార్థులు

మహారాష్ట్ర పుణె సమీపంలోని సోలాపూర్​ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది కళాశాల విద్యార్థులు మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. సరదాగా వర్షాకాలపు పర్యటనకు వెళ్లిన వీరు.. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.

ట్రక్కును ఢీకొన్న కారు...9 మంది విద్యార్థులు మృతి

By

Published : Jul 20, 2019, 8:05 AM IST

Updated : Jul 20, 2019, 10:23 AM IST

ట్రక్కును ఢీకొన్న కారు...9 మంది విద్యార్థులు మృతి

మహారాష్ట్ర పుణె సమీపంలోని సోలాపూర్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ విషాద ఘటనలో కారులోని 9 మంది మృతిచెందారు. వీరందరు కళాశాల విద్యార్ధులు.

పుణెలోని యావత్​మల్​​ ప్రాంతానికి చెందిన కాలేజీ విద్యార్థులు ఓ కారులో వర్షకాల పర్యటన కోసం రాయ్​గఢ్​ వెళ్లారు. తిరుగు ప్రయాణం సమయంలో
కుర్వక్​ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు రోడ్డు డివైడర్​ను దాటుకుని ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ దుర్ఘటనలో విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఇరాన్​ చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు: బ్రిటన్

Last Updated : Jul 20, 2019, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details