తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ రద్దుకోసం నేడు కేబినెట్​ సమావేశం

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన భాజపా.. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. 16వ లోక్‌సభ రద్దు కోసం ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

By

Published : May 24, 2019, 5:21 AM IST

లోక్​సభ రద్దుకోసం నేడు కేబినెట్​ సమావేశం

లోక్​సభ రద్దుకోసం నేడు కేబినెట్​ సమావేశం

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది భాజపా. 16వ లోక్​సభ రద్దు కోసం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్‌సభ రద్దుకు తీర్మానం రూపొందించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం కోసం పంపనుంది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ముగ్గురు కమిషనర్లూ రాష్ట్రపతిని కలిసి.... విజయం సాధించిన లోక్‌సభ సభ్యుల జాబితాను అందజేస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసి భాజపాను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానిస్తారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 3న ముగియనుండగా ఆ లోపే రాష్ట్రపతి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఇదీ చూడండి: కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

ABOUT THE AUTHOR

...view details