పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే సీఏఏపై తాజాగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంతవరకు బంగాల్లో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయనివ్వబోనని ఉద్ఘాంటించారు.
"నేను జీవించి ఉన్నంత కాలం బంగాల్లో సీఏఏను అమలు చేయనివ్వను. ఎవ్వరూ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. బంగాల్లో ఎటువంటి నిర్బంధ కేంద్రం ఉండదు. కిరాతకమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎందుకు నిరసనలు చేయకూడదు? ఆందోళనలు చేపట్టిన విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిని విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరిస్తోంది."