తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన హెలికాప్టర్ మనోళ్లే కూల్చేశారు!

ఫిబ్రవరి 27న భారత సరిహద్దుల్లో.. కశ్మీర్​లోని బడ్గామ్​లో కూలిన భారత వైమానికదళం హెలికాప్టర్​ను మన దళమే పడగొట్టినట్టు తేల్చింది. కమాండర్ల సమన్వయ లోపమే ఈ హెలికాప్టర్ కూలేందుకు కారణమని వాయుసేన అధికారులు వెల్లడించారు.

By

Published : Apr 1, 2019, 4:02 AM IST

Updated : Apr 1, 2019, 2:28 PM IST

మన హెలికాప్టర్ మనోళ్లే కూల్చేశారు!

మన హెలికాప్టర్ మనోళ్లే కూల్చేశారు!
ఫిబ్రవరి 27న జమ్ముకశ్మీర్​లోని బడ్గామ్​లో కూలిన హెలికాఫ్టర్ ప్రమాదానికి వాయుసేనలో సమన్వయ లోపమే కారణమని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 26న పాక్​లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు చేసింది భారత వాయుసేన. ఈ దాడి మరుసటి రోజైన ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. పాక్​ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత వాయుసేన.

ఈ క్రమంలోనే ఓ హెలికాప్టర్​ను గమనించిన మన వైమానిక దళం శత్రువుదనుకుని దాన్ని క్షణాల్లో కూల్చేసింది. ఆ హెలికాప్టర్​ రాడార్​ మన సైన్యానికి సిగ్నల్ ఇవ్వకపోవటమే ఈ కూల్చివేతకు కారణం.

శత్రువా, మిత్రుడా అని తెలిపే ఒక బటన్ హెలికాఫ్టర్​లో ఉంటుంది. దీనిని పైలట్ ఆన్​ చేయకపోవడం వల్ల అది మన దేశానికి చెందిన ఛాపర్​ అని అధికారులు గుర్తించలేకపోయారు. శత్రుదేశానికి చెందినదిగా భావించి యుద్ధ విమానాల ద్వారా లాంఛర్లను పంపి కూల్చేశారు.

శత్రువా, మిత్రుడా అని గుర్తించే మీటను ఆంగ్లంలో 'ఫ్రెండ్​ ఆర్​ ఫో' అని పిలుస్తారు. ఈ మీట రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్​లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

"ఏ వాయు ప్రమాదంలోనైనా విచారణ న్యాయస్థానం ప్రమాదానికి గల కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి కారణమేమై ఉంటుందోనని విశ్లేషిస్తుంది. కోర్టు ఏ విషయమూ వెల్లడించకముందే వ్యాఖ్యానించడం సరైనది కాదు "

- వైమానిక దళాధికారి

ప్రమాద సమయంలో ఛాపర్​ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడుపుతున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ఉదయం 10.10 కి గాల్లోకి లేచిన హెలికాఫ్టర్ కొద్ది సేపటికే కూలిపోయింది. అదే రోజు ఉదయం 9.30 గంటలకు పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. పాక్​ విమానాల్ని భారత వాయుసేనలు సమర్థంగా తిప్పికొట్టాయి.

Last Updated : Apr 1, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details