తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ సరిహద్దులో మరో సొరంగం

భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఓ సొరంగాన్ని బీఎస్​ఎఫ్ గుర్తించింది. జమ్మూలోని సరిహద్దు కంచెకు దగ్గర ఈ సొరంగం ఉన్నట్లు తెలిపింది.

kathua, tunnel
పాక్​ సరిహద్దులో మరో సొరంగం

By

Published : Jan 13, 2021, 1:06 PM IST

Updated : Jan 13, 2021, 5:51 PM IST

జమ్మూ కతువా జిల్లాలోని భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) బుధవారం గుర్తించాయి. హీర్​నగర్​ సెక్టార్​లోని బాబియాన్ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ సొరంగం బయటపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్​ నుంచి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడేందుకు ఆ సొరంగ మార్గం ఏర్పాటు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

కతువా జిల్లాలో బయటపడ్డ సొరంగం

గత ఆరునెలల్లో..

గత ఆరు నెలల్లో సాంబా, కతువా జిల్లాల్లో అధికారులు కనుగొన్న మూడో సొరంగం ఇది.

"సుమారు 150 మీటర్లు పొడవున్న సొరంగాన్ని గుర్తించాం. పాకిస్థాన్​లోని షకెర్​గర్హ్​ గ్రామానికి ఈ సొరంగం అనుసంధానమై ఉంది."

-ఎన్​ఎస్​ జమ్​వాల్​, బీఎస్​ఎఫ్​ ఐజీ

పాక్​ హస్తం..

ఈ సొరంగం నిర్మాణంలో పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని జమ్​వాల్​ అన్నారు. పాకిస్థాన్​ గుర్తులతో ఉన్న ఇసుక బస్తాలు తమకు లభించాయన్నారు. ఇటువంటివే ఇదివరకు గుర్తించిన సొరంగాల వద్ద కూడా స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే ఎటువంటి చొరబాట్లు జరగలేదన్నారు.

ఇదీ చూడండి: పాక్ భూభాగంలోకి 200మీ. చొచ్చుకెళ్లిన బీఎస్ఎఫ్

Last Updated : Jan 13, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details