తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్టికల్​ 370' రద్దు సభలు 700కు పెంపు.. కారణం?

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భాజపా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ అంశంపై 370 సభలను ఏర్పాటు చేసి ప్రజలకు.. ఆర్టికల్ రద్దుపై అవగాహన కల్పించాలని తొలుత నిర్ణయించింది. అయితే తాజాగా సమావేశాల సంఖ్యను 700కు పెంచింది.

'370' రద్దు సభలు 700కు పెంపు.. కారణం?

By

Published : Sep 24, 2019, 5:45 AM IST

Updated : Oct 1, 2019, 7:03 PM IST

జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిప్తతి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది భాజపా. ఇంతకు ముందు 370 సభలను పెట్టేందుకు నిర్ణయించిన కేంద్రం.. వాటికి వస్తోన్న స్పందనను గమనించి 700కు పెంచేందుకు నిర్ణయించింది.

గుజరాత్​, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నియోజకవర్గ స్థాయిలో ఓ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తోంది.

"ప్రజలు ఈ నిర్ణయంపై ఎంతో సంతోషంగా ఉన్నారు. సభలకు జనం ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ర్యాలీల సంఖ్య పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. 700 సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నాం."

- సత్యకుమార్​, భాజపా జాతీయ కార్యదర్శి

బిహార్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈ సమావేశాల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది భాజపా. ప్రతి కార్యక్రమంలోనూ ఒక కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత పాల్గొంటారు.

చిన్న ప్రాంతాలైన పుదుచ్చేరిలో నాలుగు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో 15 సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రచారాన్ని రెండు భాగాలుగా చేసింది భాజపా. సంపర్క్, జన్​ సంపర్క్​గా పేర్కొంది.

ఈ సమావేశాలను అమిత్​ షా ముందుండి నడిపిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దును గొప్ప విజయంగా అభివర్ణంచారు షా. ఈ ఆర్టికల్ రద్దుతో కశ్మీర్​లో పూర్తి స్థాయి భారత రాజ్యాంగం వర్తిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: భాజపా లక్ష్యంగా మరోసారి మమతా విమర్శలు

Last Updated : Oct 1, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details