తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2019, 12:05 AM IST

ETV Bharat / bharat

కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే భాజపా ఆశలు!

పశ్చిమ బంగాల్​లో పాగా వేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న భాజపా ఈసారైనా జెండా ఎగరేయాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రయత్నించినా... దీదీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అయినా పట్టు వదలకుండా బంగాల్​లో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఓ వైపు సిట్టింగ్ అభ్యర్థులను తప్పించి లోక్​సభ అభ్యర్థిత్వానికి తృణమూల్ కొత్త రక్తం ఎక్కించింది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో ఫక్తు రాజకీయ వ్యూహాలు పన్నిన భాజపా అధినాయకత్వం... గెలుపే ధ్యేయంగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసింది. మరి ఈసారి బంగాల్​లో భాజపా అనుకున్నది సాధిస్తుందా?

18 మంది అభ్యర్థుల జాబితా విడుదల

కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే కాషాయ పార్టీ ఆశలు!
తృణమూల్​ కాంగ్రెస్​ అభ్యర్థులను లోక్​సభ ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా బంగాల్​ భాజపా పావులు కదుపుతోంది. టీఎంసీ నుంచి భాజపాలో చేరిన అసమ్మతి నేతలకే అధికసంఖ్యలో టికెట్లు కేటాయించింది కాషాయ పార్టీ. ప్రజావ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు నిరాకరించి తృణమూల్ కొత్త నేతలకు అవకాశమిచ్చింది. మహిళలకు ఏకంగా 41శాతం సీట్లు కేటాయించారు దీదీ. భాజపా మాత్రం సీనియర్​ నేతలు, ఫిరాయింపుదారులపైనే ఆశలు పెట్టుకుంది.

42 లోక్​సభ స్థానాలున్న బంగాల్​లో భాజపా 28మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్​ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది భాజపా.

ఇటీవలే తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు. ఇందులో పది మంది సిట్టింగ్​ ఎంపీలకు టికెట్లు నిరాకరించి కొత్తవారిని నిలబెట్టారు. దీంతో పలువురు పార్టీ అసమ్మతి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

6 సీట్లు వారికే!

భాజపా విడుదల చేసిన జాబితాలో ఐదుగురు టీఎంసీ నుంచి వచ్చిన వారే. ఒక సీటు సీపీఎం పార్టీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు. మిగిలిన సీట్లను పార్టీ సీనియర్​ నాయకులకు కేటాయించి, వారిపైనే ఆశలు పెట్టుకుంది భాజపా.

2014 లోక్​సభ ఎన్నికల్లో 42 స్థానాల్లో కేవలం 2 సీట్లకే పరిమితమైంది భాజపా. ప్రస్తుతం 23 స్థానాల్లో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ నేతలు

కేంద్రమంత్రి బాబుల్​ సుప్రియో తిరిగి అసెన్​సోల్​ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో టీఎంసీ నుంచి నటి మున్​మున్​ సేన్​ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ మేదినీపూర్​ నుంచి టీఎంసీ నేత మానస్​ బునియాపై పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మనువడు చంద్రకుమార్​ బోస్​ దక్షిణ కోల్​కతా నుంచి పోటీచేయనున్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితురాలైన మాజీ ఐపీఎస్​ అధికారి భారతి ఘోష్​ టీఎంసీ అభ్యర్థి దీపక్​ అధిక్రేపై పోటీ చేస్తున్నారు.
బంగాల్​లో లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరగనున్నాయి.

ఇవీ చూడండి:184 మంది లోక్​సభ అభ్యర్థులతో భాజపా తొలి జాబితా

ABOUT THE AUTHOR

...view details