ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాల్లో ఒకటైన 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానాన్ని వెబినార్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంకల్పించింది భాజపా. డిసెంబర్ చివరి నాటికి 25 వెబినార్ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పార్టీ నేతలతోపాటు వివిధ విభాగాల్లోని నిపుణులు సైతం పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' విధానాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సైతం దీనిపై ప్రధాని మాట్లాడారు.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై భాజపా 25 వెబినార్లు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భాజపా రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ చివరి నాటికి 25 వెబినార్లను నిర్వహించనుంది. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ సమావేశాల్లో న్యాయవాదులు, అకాడమిక్ నిపుణులతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొననున్నట్లు భాజపా కీలక ఒకరు తెలిపారు.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానంపై 25 వెబినార్లు
దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని వివరించారు.
ఇదీ చదవండి :'తదుపరి లక్ష్యం.. ఒకే దేశం- ఒకే ఎన్నిక'