తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా-సేన కూటమికి 200 అసెంబ్లీ సీట్లు ఖాయం'

భాజపా, శివసేనల్లో ఎవరూ బిగ్​ బ్రదర్​ కాదని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కనీసం 200 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

'భాజపా, శివసేన కూటమికి 200 అసెంబ్లీ సీట్లు ఖాయం'

By

Published : Oct 5, 2019, 11:38 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి 288 స్థానాల్లో కనీసం 200 సీట్ల వరకు గెలుచుకుంటాయని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు పార్టీల్లో ఎవరూ ఎన్నడూ 'బిగ్​ బ్రదర్'లా వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు. భాజపా-శివసేన కూటమి 288 స్థానాల్లో పోటీచేస్తోంది.

"కాంగ్రెస్ గత రెండు నెలలుగా కనీసం పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేయలేకపోయింది. ఇదే సమయంలో మా పార్టీకి కొత్త కార్యనిర్వహక అధ్యక్షుడు వచ్చారు. మేము భారీస్థాయిలోపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా 8 కోట్ల మంది సభ్యులను చేర్చుకున్నాం. ఇప్పుడు 19 కోట్ల మంది సభ్యుల పార్టీగా భాజపాఅవతరించింది."- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి, భాజపా నేత

భాజపా 24 గంటలూ ప్రజలతో మమేకం అవుతోందని, ఎన్నికల్లో తప్పకుండా కూటమి విజయం సాధిస్తుందని జావడేకర్ అభిప్రాయపడ్డారు. భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతుండడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను జావడేకర్ తిప్పికొట్టారు. కశ్మీర్ అంశాన్ని ప్రజలే మాట్లాడుకుంటున్నారని, భాజపా ప్రచారం చేయడంలేదని స్పష్టం చేశారు.

కూటమి సర్దుబాటు ఇలా

288 అసెంబ్లీ స్థానాల్లో కూటమిలోనిభాజపా 150,శివసేన 124, ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు ఆర్​పీఐ, ఆర్​ఎస్​పీ కలిపి 14 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.

మహారాష్ట్రలో అక్టోబర్ 21న పోలింగ్​, 24న కౌంటింగ్ జరుగనుంది.

ఇదీ చూడండి:భారత్​-బంగ్లాదేశ్ మైత్రి ప్రపంచానికే ఆదర్శం: మోదీ

ABOUT THE AUTHOR

...view details