ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ అధికారంలోకి రాలేరని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ జోస్యం చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని పునరుద్ఘాటించారు పవార్.
భాజపా గెలిచినా.. మోదీ ప్రధాని కాలేరు - మోదీ
లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాల్లో గెలుపొందినా మోదీకి మళ్లీ ప్రధానయ్యే అవకాశం రాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. ప్రధాని పదవిపై భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ఉండే అవకాశముందని ఆయన అన్నారు.
"నా అంచనా ప్రకారం.. భాజపాకు సరైన మెజారిటీ లభించదు. కానీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. రాజకీయ ప్రభావాలతో మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న నమ్మకం లేదు. నేను జ్యోతిష్యుణ్ని కాదు. వాళ్లకు కావాల్సిన మెజారిటీ సంఖ్య లభించదు. అధికారం కోసం భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీకి అవకాశం రాకపోవచ్చు. ప్రధానిగా ప్రజలు కొత్త వ్యక్తిని చూస్తారు."
- శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు
ఇదీ చూడండి:'మోదీ చేతుల్లోనే దేశం సురక్షితం'