తెలంగాణ

telangana

మిషన్​ బంగాల్: 23 అస్త్రాలతో భాజపా పక్కా ప్లాన్

By

Published : Nov 19, 2020, 6:57 AM IST

వరుస విజయాలతో భాజపా దూకుడు మీద ఉంది. ఇదే జోరును బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని పార్టీ పెద్దలు కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా బూత్​స్థాయిలో కూడా పట్టు సాధించే దిశగా ప్రణాళికలను రూపొందిచారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

bjp come up with 23 rules to win the bengal assembly elections
దీదీని ఎదుర్కోవడానికి 23 అస్త్రాలతో భాజపా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో భాజపా భారీ కసరత్తు చేస్తోంది. 'మిషన్‌ బెంగాల్‌' పేరుతో బూత్‌ స్థాయి వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 23 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. వీటి అమలు తీరును పరిశీలించడానికి ఆయన ప్రతి నెలా ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇందులో ముఖ్యమైనవి కొన్ని...

  • బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి. రిజర్వుడు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పార్టీలో చేర్చుకోనున్నారు.
  • బలాల ఆధారంగా బూత్‌లను ఎ, బి, సి, డి వర్గాలుగా విభజించనున్నారు. బూత్‌ సామర్థ్యాన్ని డి నుంచి 'సి'కి, సి నుంచి 'బి'కి, బి నుంచి 'ఎ'కు పెంచేలా కార్యకర్తలకు తగిన కార్యాచరణ ఇవ్వనున్నారు. ఈ విషయంలో ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • కార్యాచరణలో భాగంగా...ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన కనీసం 20 మందిని పార్టీలో చేర్చుకోవాలి.
  • ప్రధాని చేసే మన్‌ కీ బాత్‌, ఇతర నాయకుల ప్రసంగాలను ప్రజలు వినేలా ఏర్పాట్లు చేయాలి.
  • పార్టీ తరఫున కనీసం ఆరు కార్యక్రమాలు నిర్వహించాలి.
  • బూత్‌ పరిధిలో కనీసం అయిదు ప్రాంతాల్లో పార్టీ గుర్తు కమలం ప్రముఖంగా కనిపించేలా చిత్రీకరించాలి.
  • మోటారు సైకిళ్లు ఉన్న కనీసం అయిదుగురు పార్టీ కార్యకర్తలను గుర్తించాలి.
  • దేవాలయాల పూజారులు, సాధువులు, సహకార బ్యాంకులు, పాల సంఘాల నాయకులు, సర్పంచులు, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వారితో సత్సంబంధాలు నెలకొల్పాలి.
  • ఆయా బూత్‌ల పరిధిలోని ఓటర్లు, కార్యకర్తలు తమ ఫోన్లలో నమో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి.
  • ప్రతి వీధి, ప్రతి ఓటరును విడిచిపెట్టకుండా ప్రచారం చేయాలి.
  • గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బూత్‌ల వారీగా సేకరించి వాటిని విశ్లేషించాలి. అందుకు తగ్గట్టుగా స్థానిక వ్యూహాలను రూపొందించాలి.

ABOUT THE AUTHOR

...view details