తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓనం పర్వదినాన వానర సేనకు కమ్మని విందు - కొల్లం

ఏమండోయ్​.. వానర సేనకు పసందైన విందట..! విందంటే సాదాసీదాగా రొట్టె ముక్కలు కాదట..! పంచభక్ష పరమాన్నాలతో కోతి బావలకు భోజనమట..! అరిటాకుల్లో వడ్డన, రాజ మర్యాదలట..! ఆహ్వానమందుకున్న వెంటనే ఆలయ ప్రాంగణంలో కోతుల కిటకిట!  ఇంతకీ ఇదంతా ఎందుకటా అంటే....

ఓనం పర్వదినాన వానర సేనకు కమ్మని విందు

By

Published : Sep 11, 2019, 2:17 PM IST

Updated : Sep 30, 2019, 5:39 AM IST

ఓనం పర్వదినాన వానర సేనకు కమ్మని విందు
కేరళ సంప్రదాయానికి అద్దం పట్టే ఓనం పర్వదినాన.. కొల్లం జిల్లాలోని సడ్తంకొట్ట ఆలయంలో వానర సమూహానికి విందు ఏర్పాటు చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న 'వానర భోజన సధ్య' ఆనవాయితీని ఈసారీ కొనసాగించారు.

ఓనం రోజు విష్ణుమూర్తి వామనావతారాన్ని కొలుస్తారు ఇక్కడి ప్రజలు. వామనుడి చేతిలో హతమైన మహాబలి చక్రవర్తి ఆత్మ ఈ పండుగ రోజు వానరంలా వస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే 35 ఏళ్ల క్రితం అరవిందక్షణ్​ నాయర్ అనే స్థానికుడు​ ఏటా ఓనం పండుగరోజు ఇలా కోతులకు విందు పెట్టే ఆచారాన్ని ప్రారంభించారని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు ఇలా వానరులకు ఆతిథ్యం ఇస్తారు.

ఈ సారి వానర విందు మరింత ఘనంగా ఏర్పాటు చేశారు. ఎంతో జాగ్రత్తగా ఏరికోరి రుచికరమైన వంటకాలు వండించారు నిర్వహకులు. పచ్చడి నుంచి పాయసం వరకు ఏ పదార్థమూ లేదనకుండా అన్ని రకాలు సిద్ధం చేశారు. భోజన తాంబూలాలు స్వీకరించేందుకు వందలాది కోతులు ఆలయ ప్రాంగణానికి విచ్చేశాయి.

ఇదీ చూడండి:20వ సారి గర్భం దాల్చిన మహిళ..!

Last Updated : Sep 30, 2019, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details