జూన్ 17 నుంచి పార్లమెంటు తొలిదశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జూన్ 16 ఉదయం పార్లమెంటు భవన్లో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు.
జూన్ 16న అఖిలపక్ష సమావేశం - భవన్
పార్లమెంటు తొలిదశ సమావేశాలు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు జూన్ 16న అఖిలపక్ష భేటీకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ సమావేశం కానున్నట్లు తెలిపారు.
జూన్ 16న అఖిలపక్ష సమావేశం
జూన్ 16 సాయంత్రం ఎన్డీఏ భేటీ కానుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను భేటీలో చర్చించనున్నారు. భాజపా పార్లమెంటరీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమూ అదే రోజు జరగనుంది.
- ఇదీ చూడండి: గుజరాత్ నుంచి దిశ మార్చుకున్న 'వాయు'