తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేజ్రీ... దమ్ముంటే ఆ నిరసనల్లో పాల్గొనండి' - kejriwal

దిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా ఆప్ అధినేత కేజ్రీవాల్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్లీ షహీన్ బాగ్​​లో జరుగుతున్న నిరసనలకు ఆప్ మద్దతుగా ఉందో లేదో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. ధైర్యముంటే షహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు.

Amit Shah dares Kejriwal to visit Shaheen Bagh
'కేజ్రీ... దమ్ముంటే ఆ నిరసనల్లో పాల్గొనండి'

By

Published : Jan 27, 2020, 8:50 PM IST

Updated : Feb 28, 2020, 4:41 AM IST

ఆమ్​ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్​కు ధైర్యముంటే దిల్లీ షహీన్​ బాగ్​ నిరసనల్లో పాల్గొనాలని సవాలు విసిరారు భాజపా అగ్రనేత అమిత్​ షా. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నవారికి మద్దతుగా ఉన్నారో లేదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రిథాలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.

"కేజ్రీవాల్​ను ఓ ప్రశ్న అడుగుతున్నా. మీరు షార్జీల్ ఇమామ్​ను అదుపులోకి తీసుకోవడానికి అనుకూలమా? కాదా? మీరు షహీన్ బాగ్ ప్రజలకు మద్దతుగా ఉన్నారా? లేదా? అనే విషయం దిల్లీ ప్రజలకు చెప్పండి. షహీన్ బాగ్ ప్రజల వెంటే ఉన్నామని మీరు(ఆప్ నేతలు) చెబుతున్నారు. మీకు దమ్ముంటే వెళ్లి వారితో కూర్చొండి. అంతిమ నిర్ణయం దిల్లీ ప్రజలు తీసుకుంటారు." -అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

షార్జీల్ ఇమామ్ షహీన్ బాగ్ ప్రాంతంలో తొలుత నిరసనలు ప్రారంభించాడు. అసోంను దేశం నుంచి విడగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతనిపై దిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:అమర జవాన్లకు ఓ గుడి ఉందని తెలుసా?

Last Updated : Feb 28, 2020, 4:41 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details