ETV Bharat / bharat

అమర జవాన్లకు ఓ గుడి ఉందని తెలుసా? - Ujjain Martyrs temple news

హిందూ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని​లో అమర జవాన్ల జ్ఞాపకార్థం ఓ ఆలయాన్ని నిర్మించారు. భావి తరాలకు అమరుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు 50మంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. 'భారత  సేవకుల ఆలయం' పేరుతో ఓ రిటైర్డ్ జడ్జి ఈ గుడి కట్టించారు.

A temple dedicated to Martyrs
అమర జవాన్లకు ఓ గుడి
author img

By

Published : Jan 27, 2020, 1:57 PM IST

Updated : Feb 28, 2020, 3:27 AM IST

అమర జవాన్లకు ఓ గుడి ఉందని తెలుసా?

హిందూ ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించే మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో సైనికులు, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఓ ఆలయాన్ని నిర్మించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన 50మంది అమరుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నగరంలోని నర్సింగ్ ఘాట్​ వద్ద ఉన్న ఈ గుడికి భారత సేవకుల ఆలయంగా నామకరణం చేశారు. విగ్రహాలపై అమరుల వీర గాథలను రాసి ఉంచారు.

భారత మొదటి సైన్యాధిపతి కె.ఎం. కరియప్ప, మొదటి ఫీల్డ్​ మార్షల్​ జనరల్​ సామ్​ మనేక్షా, వాయుసేన మాజీ అధిపతి అర్జున్​ సింగ్​ సహా పలువురి అమరుల ప్రతిమలు ఆలయంలో ఉన్నాయి. వారి శౌర్యం, సంకల్ప శక్తి భారత త్రివిధ దళాల్ని దేశానికి గర్వకారణం చేశాయి.

సైనికుల త్యాగాలకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని విశ్రాంత జడ్జి దాన్​ సిగ్ చౌదరి కట్టించారు. పదవీ విరమణ చేశాక వచ్చిన డబ్బుతో దీనిని నిర్మించారు. ప్రస్తుతానికి ఆయన లేకపోయినా అమరవీరుల కోసం కట్టించిన గుడి భావి తరాలకు నిజమైన వీరుల చరిత్రను తెలిజేస్తుందని ఆలయ పూజారి రామ్​ సింగ్ చెబుతున్నారు.

దాన్​ సింగ్​ సింగ్​ అనుకున్న లక్ష్యం విజయవంతమైందని.. ఇక్కడి స్థానికులు ఈ ఆలయంలో రోజూ పూజలు నిర్వహిస్తున్నారని రామ్​ సింగ్ తెలిపారు. ఇటువైపుగా వెళ్లేవారంతా గొప్ప వీరులను స్మరించుకుని పూజిస్తారని చెప్పారు.

గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శించారు.

ఇదీ చూడండి: ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్​

Intro:उज्जैन महाकालेश्वर मंदिर में गणतंत्र दिवस के दिन बाबा महाकाल का तिरंगे से शृंगार किया गयाBody:उज्जैन 26 जनवरी गणतंत्र दिवस के दिन विश्व प्रसिद्ध महाकालेश्वर जोतिर्लिंग में होने वाली दिव्य भस्म आरती में बाबा महाकाल में राष्ट्रीय पर्व गणतंत्र दिवस के तिरंगा रूप में आकर्षक श्रगार किया गया, Conclusion:उज्जैन विश्व प्रसिद्ध महाकालेश्वर जोतिर्लिंग में होने वाली दिव्य भस्म आरती में बाबा महाकाल में राष्ट्रीय पर्व गणतंत्र दिवस के तिरंगा रूप में आकर्षक श्रगार किया गया, बड़ी संख्या में श्रद्धालुओं ने बाबा की भस्म आरती के दर्शन के साथ देश का राष्ट्रीय पर्व गणतंत्र पर्व भी मनाया
Last Updated : Feb 28, 2020, 3:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.