తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9 రోజుల అనంతరం వెనక్కిమళ్లిన జగన్నాథ రథాలు

తొమ్మిదిరోజుల పాటు అత్తవారిల్లైన గుండిచా ఆలయంలో కొలువు తీరిన పూరీ జగన్నాథుడు శ్రీమందిరానికి తిరుగుపయనానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం.. సుభద్ర, జగన్నాథుల రథారోహణం ఉంటుంది. అనంతరం.. రథయాత్ర జరుగుతుంది.

By

Published : Jul 1, 2020, 9:59 AM IST

rathyatra
నేడు జగన్నాథుడి తిరుగు ప్రయాణ యాత్ర

పూరీ జగన్నాథుడు శ్రీమందిరానికి తిరిగి వచ్చే బహుడా పహండీ యాత్రకు అంతా సిద్ధమైంది. జగన్నాథుడి అత్తవారిల్లుగా భావించే గుండిచా ఆలయం నుంచి.. దేవీ సుభద్ర, మహాప్రభు జగన్నాథుడు, బలభద్ర, సుదర్శనల రథాలు తిరుగుప్రయాణం కానున్నాయి. జగన్నాథుడి తిరుగుయాత్రకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సుదర్శన, బలభద్ర రథప్రతిష్ఠ ముగిసింది. ప్రత్యేక పూజల అనంతరం సుభద్ర, జగన్నాథుల రథారోహణం ఉంటుంది. అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది.

కార్యక్రమం ఇలా..

ఉదయం 4 గంటలకు మంగళహారతితో తిరుగు ప్రయాణ ఉత్సవం ప్రారంభమయింది. అనంతరం వరుసగా మైలం, తడప లాగి, రోసోహోమ్, అబకాష, సూర్య పూజ, ద్వార పాల పూజ పూర్తయ్యయి. ఉదయం 5.30 గంటలకు బెసా సెసా, సకల దూప, సేనాపటా లగీ, మంగళార్పన చేశారు పూజారులు. కీలక ఘట్టమైన చేరా పన్హారా పూర్తయిన అనంతరం బహుడా పహండీగా పిలిచే తిరుగుప్రయాణం ఊరేగింపుగా ప్రారంభం కానుంది.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు..

సీఆర్​పీఎఫ్, ఆర్​ఏఎఫ్​, ఎస్​ఏఎఫ్​కు చెందిన 100 దళాలు, 36 బృందాల ట్రాఫిక్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

12 మందికి కరోనా..

పూరీలో గతవారం నుంచి సేకరించిన దాదాపు 5 వేల నమూనాల్లో.. 12 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ కొవిడ్​ ఆస్పత్రులకు తరలించారు.

ఇదీ చూడండి:డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ABOUT THE AUTHOR

...view details