తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 6:11 PM IST

ETV Bharat / bharat

ముంబయిని భయపెట్టినా మేలు చేసిన 'నిసర్గ!

'నిసర్గ' తుపాను కారణంగా ముంబయిలో గాలి నాణ్యత మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. అధిక వేగంతో వీచిన గాలులు, వర్షాల వల్ల నగరంలో గాలి నాణ్యత సూచీ 17కు చేరినట్లు పేర్కొన్నారు.

After cyclone, Mumbai's air quality improves to year's best
''నిసర్గ' తుపానుతో ముంబయిపై సానుకూల ప్రభావం!

మహారాష్ట్రలో విరుచుకుపడిన 'నిసర్గ' తుపాను ముంబయి నగరంపై సానుకూల ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. గురువారం నాటికి గాలి నాణ్యత 17కు చేరినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో నమోదైన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని వాతావరణ అంచనా పరిశోధనా వ్యవస్థ (ఎస్ఏఎఫ్​ఏఆర్) తెలిపింది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన సూచీలో అత్యుత్తమైనది ఇదే. అధిక వేగంతో వీచిన గాలులు, వర్షపాతం.. గాలి నాణ్యత మెరుగుపడేందుకు కారణమయ్యాయి.

డాక్టర్. గుఫ్రాన్​ బీగ్, ఎస్ఏఎఫ్​ఏఆర్​ డైరెక్టర్​ ​​

శుక్రవారం నాటికి గాలి నాణ్యత 15కు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0 నుంచి 50 వరకు నమోదైతే మంచిదిగా పరిగణిస్తారు. 51 నుంటి 100 వరకు సంతృప్తికరంగా, 101 నుంచి 200 వరకు ఫర్వాలేదని సూచిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకరంగా భావిస్తారు.

ABOUT THE AUTHOR

...view details