తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా X ఆప్: 'నిర్భయ' జాప్యంపై మాటల యుద్ధం - Nirbhaya gangrape UPDATES

నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు ఆలస్యం కావడానికి దిల్లీ ప్రభుత్వ విధానాలే కారణమని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. భాజపా విమర్శలను ఆప్​ తిప్పికొట్టింది. శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంటాయని... కాషాయ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎదురుదాడి చేసింది.

NIRBHAYA CASE
భాజపా X ఆప్: 'నిర్భయ' జాప్యంపై మాటల యుద్ధం

By

Published : Jan 16, 2020, 6:47 PM IST

నిర్భయ దోషుల మరణశిక్ష అమలులో జాప్యంపై భాజపా, ఆమ్​ఆద్మీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆలస్యానికి కారణం మీదంటే మీదని ఇరు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

నోటీసులకు రెండేళ్లు...

మరణ శిక్షకు వ్యతిరేకంగా దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించిన తర్వాత దోషులకు నోటీసు ఇచ్చేందుకు ఆప్‌ ప్రభుత్వానికి రెండేళ్లకు పైగా సమయం పట్టిందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ విమర్శించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోనే ఆప్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఉంటే, దోషులకు ఉరిశిక్ష పడి, నిర్భయకు న్యాయం జరిగేదని అభిప్రాయపడ్డారు.

మీదే ఆలస్యం:ఆప్​

భాజపా విమర్శలను ఆమ్​ఆద్మీ తిప్పికొట్టింది. ఆలస్యానికి కారణం తమదేనని కేంద్రమంత్రి ఆరోపించడాన్ని అసత్యంగా కొట్టిపారేసింది. శాంతిభద్రతలు కేంద్రం అధీనంలో ఉన్నప్పుడు... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆప్​ ఎదురుదాడి చేసింది.

ABOUT THE AUTHOR

...view details