దిల్లీ శాసనసభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తమ వ్యూహాలకు పదును పెట్టింది భాజపా. ఆమ్ఆద్మీ ప్రభుత్వం లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఐదేళ్లుగా ప్రజలను కేజ్రీవాల్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని విమర్శించారు.
"ప్రజాస్వామ్య పండుగపై నాకు విశ్వాసం ఉంది. ఐదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం హామీలను విస్మరించింది. ఇందుకు ఓటమి తప్పదు. ప్రధాని మోదీ నాయకత్వంలో దిల్లీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేస్తుంది. ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్లో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలి."
- అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
హామీలను పక్కనబెట్టి ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటనలు, ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపించారు షా. ఆప్ హామీ ఇచ్చిన ఉచిత వైఫై, 15 లక్షల సీసీటీవీలు, కొత్త కళాశాలు, ఆసుపత్రుల కోసం దిల్లీ వాసులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.