దిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇదీ చూడండి : కర్ణాటకలో ఘోరం.. సిలిండర్ పేలి తల్లీకూతుళ్లు మృతి
దిల్లీ ఎన్నికలకు ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 21ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణకు 24వ తేదీ తుదిగడువని అరోడా వెల్లడించారు. హస్తినలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
"జనవరి 6 నాటికి దిల్లీలో 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 13 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. దాదాపు 90వేల మంది సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం."
- సునీల్ అరోడా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్