ప్రశాంతంగా అలాఅలా గడిచిపోయే జీవితాన్ని.. కాలు బయటపెట్టకుండా చేసేసింది కరోనా. సరదాగా స్నేహితులను కలసి మచ్చట్లు పెట్టే అవకాశం కూడా లేదు. పోనీ దోస్త్‌ను ఇంటికి పిలిచి మాట్లాడదామంటే.. ఇంటి యజమానులు ఒప్పుకోరు. వీటన్నింటితో విసిగిపోయిన ఓ యువకుడు 'అద్భుత' ప్లాన్ వేశాడు.
కర్ణాటక బెంగళూరులోని ఆర్య సమాజ్ మార్గంలో ఓ అపార్ట్మెంట్ ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా అపార్ట్మెంట్ యాజమాన్యం బయట వ్యక్తుల్ని ఎవర్నీ లోనికి అనుమతించడం లేదు. అయితే ఓ విద్యార్థి తన స్నేహితుడ్ని ఫ్లాట్‌కు తీసుకువచ్చేందుకు వినూత్నంగా ఆలోచించాడు.
ఈ రోజు ఉదయం బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఓ పెద్ద సూట్‌కేస్‌తో అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఎలాగైతేనో మొత్తానికి సూట్‌కేస్‌ను రూమ్ వరకు తీసుకువచ్చాడు. అయితే ఇతర ఫ్లాట్ యజమానులకు ఆ సూట్‌కేస్ కదలడం చూసి అనుమానం వచ్చింది. వెంటనే తెరచి చూపించమన్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేశాక చూసి షాక్ అయ్యారు.
దోస్త్‌ను సూట్‌కేస్‌లో కుక్కి ఫ్లాట్‌లోకి గప్‌చుప్‌గా... తన స్నేహితుడ్ని సూట్‌కేస్‌లో కుక్కి అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చాడు ఆ యువకుడు. వెంటనే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.