తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్య విద్యార్థినిపై యువకుని కత్తి దాడి - విద్యార్థిని

హరియాణాలోని ఫరిదాబాద్​లో అమానుషం జరిగింది. వైద్య విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీలో నమోదైన దాడి దృశ్యాలు వైరల్​గా మారాయి.

వైద్య విద్యార్థినిపై కత్తితో యువకుడి దాడి

By

Published : Jun 27, 2019, 2:15 PM IST

వైద్య విద్యార్థినిపై యువకుని కత్తి దాడి

హరియాణాలోని ఫరిదాబాద్​లో ఓ వైద్య విద్యార్థిని ఆసుపత్రి నుంచి వెళ్తుండగా ఆమెపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిని వెంబడించి విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు యువకుణ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్​గా మారాయి.

కడుపుపైన, చేతిపై తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

" రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే నా వెనకాల వచ్చి చేయి పట్టుకున్నాడు. అతడి చెర నుంచి వదిలించుకుని పక్కనే ఉన్న వారికి చెప్పాను. అనంతరం రోడ్డుకు అవతలివైపుకు వెళ్లి నడుచుకుంటూ వెళుతున్నా. నా వెనకాలే వచ్చి కత్తితో దాడి చేశాడు. నా ఎడమ భుజం, పొట్టపై పొడిచాడు."

-బాధిత యువతి, ఫరిదాబాద్​

ఇదీ చూడండి: హరియాణా కాంగ్రెస్​ అధికార ప్రతినిధి కాల్చివేత

ABOUT THE AUTHOR

...view details