తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2019, 7:40 AM IST

ETV Bharat / bharat

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానంలోని తపాలా కార్యాలయం అది. ఏడాదికి కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తుంది. అయ్యప్ప స్వామివారికి వచ్చే లేఖలను దేవస్థానానికి అందిస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకతలేమిటో మీరే తెలుసుకోండి..

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

ఏడాదిలో మూడు నెలలు మాత్రమే తెరిచే తపాలా కార్యాలయం అది. అక్కడ ఉపయోగించే తపాలా బిళ్లల్లో స్వామి అయ్యప్ప చిత్రం మాత్రమే ఉంటుంది. అదే కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానం పోస్టాఫీస్​.

ఏకైక పోస్ట్ ఆఫీస్​

1960లో శబరిమలలోని మాలికప్పురం ఆలయం సమీపంలో ఈ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇది సబ్​పోస్ట్ ఆఫీస్​గా ఉంది. మండల-మకరవిలక్కు తీర్థయాత్ర జరిగే 66 రోజులు, విషు పండుగ జరిగే పది రోజులు మాత్రమే ఇది పనిచేస్తుంది. దేశంలో ఇలా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసే ఏకైక తపాలా కార్యాలయం ఇదే.

అయ్యప్ప ముద్రతో..

ఈ తపాలా కార్యాలయంలో 1975 నుంచి అయ్యప్పస్వామి చిత్రంతో తపాలా బిళ్లలను ముద్రిస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్​.. వివాహ, నూతన గృహప్రవేశ ఆహ్వానాలు, ధన్యవాద లేఖలు సహా భక్తుల ఆనంద, విషాద లేఖలు అన్నింటినీ స్వీకరిస్తుంది. అలాగే ఈ కార్యాలయానికి అయ్యప్ప పేరిట మనియార్డర్లు వస్తుంటాయి. వీటన్నింటినీ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయానికి అందజేస్తారు.

మొబైల్​ రీఛార్జ్​

ఈ తపాలా కార్యాలయంలో లేఖలు, మనియార్డర్లతో పాటు ఉద్యోగుల జీతాల పంపిణీ, మొబైల్ రీఛార్జ్ సేవలు కూడా అందిస్తారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా వారి సొంత చిత్రంతో తపాలా బిళ్లను కూడా అందిస్తారు. వీటిలో శబరిమల చిత్రం కూడా ఉంటుంది.

ఈ కార్యాలయంలో పోస్ట్​మాస్టర్, ఇద్దరు పోస్ట్​మెన్, ముగ్గురు గ్రూప్-డీ ఉద్యోగులు సహా మరో ఆరుగురు సిబ్బంది ఉంటారు.

ఇదీ చూడండి:'ఆ నిర్ణయం నాది కాదు.. సర్కారుకు మా మద్దతు లేదు '

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details